ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా పనిచేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

ఎన్నికల వ్యవస్థ తీరు చూస్తుంటే ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీకి తొత్తులా పనిచేస్తోందనే బలమైన భావన ప్రజల్లో కలుగుతోందని ఏపీ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆ పార్టీ, ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల విషయంలో ఇలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముమ్మాటికీ మంచిది కాదని పేర్కొంది. ప్రజల హక్కులను కాలరాసే ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది.