అర్హులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలి: కలెక్టరేట్లో కమిటీ డిమాండ్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నియోజకవర్గంలోని అర్హులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ కాసోజు, ప్రధాన కార్యదర్శి కరుణాకర్ సుధగాని వినతిపత్రం సమర్పించారు. వృద్ధులు, వికలాంగులు, విధవలు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందడం లేదన్నారు. సమగ్ర సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.