కేసీఆర్ ఫాంహౌస్ శుద్ధి వివాదం: ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్ద దళితుల నిరసన తర్వాత పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనలో ఏడుగురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో అదుపులోకి తీసుకున్న వీరిని గజ్వేల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను సిద్దిపేట జైలుకు తరలించారు. దళితులను అవమానించారనే ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.