ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై వీడని సందిగ్ధత: స్పష్టత కోరుతున్న ప్రజలు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారిక అవతరణ దినోత్సవంపై స్పష్టత కొరవడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో 1953 అక్టోబర్ 1న తొలిసారి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆ తర్వాత 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుందని చరిత్ర చెబుతోంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం నవంబర్ 1 లేదా అక్టోబర్ 1వ తేదీలలో దేనిని అధికారిక అవతరణ దినోత్సవంగా పరిగణించాలనే అంశంపై ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ భిన్న నిర్ణయాలు వెలువడుతుండటంతో గందరగోళం నెలకొంది.