కృత్రిమ మేధ పేరు మార్చాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Washington
కృత్రిమ మేధ అంటే నకిలీగా అనిపిస్తుందని, అందుకే దీనిని సూపర్ ఇంటెలిజెన్స్ లేదా ఎస్ఐ అని పిలవాలని తాను కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చైనా కంటే అమెరికా కనీసం ఒక సంవత్సరం ముందుందని, ఈ సాంకేతికతను చైనాతో పంచుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. చైనా అధినేత షీ జిన్పింగ్తో జరిగిన చర్చల అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.