విద్యార్థులకు అలర్ట్: ఎఫ్ఎంజీఈ అక్టోబర్ సెషన్ హాల్ టికెట్లు విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అక్టోబర్ సెషన్ ఎఫ్ఎంజీఈ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ప్రవేశ పత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు సూచించింది. ఈ నెల ముప్పై ఒకటిన పరీక్ష జరగనుండగా, పరీక్షా కేంద్రానికి వెళ్లేవారు హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు.