శ్రీకాకుళం జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనం కేటాయింపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీకాకుళం
నేరస్థలంలో శాస్త్రీయ ఆధారాల సేకరణ ద్వారా కేసుల ఛేదన మరింత వేగవంతం అవుతుందని శ్రీకాకుళం జిల్లా పోలీసుల తరఫున జిల్లా ఎస్పీ కే.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ వెల్లడించారు. సాంకేతికత ఆధారిత దర్యాప్తుతో పోలీసు విభాగానికి మరింత బలం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు కొత్తగా మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనం కేటాయించినట్లు అధికారులు తెలిపారు. భౌతిక ఆధారాలను సేకరించి దర్యాప్తును వేగవంతం చేయడానికి ఈ ప్రత్యేక వాహనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.