మేరీ కోమ్పై మాజీ భర్త ఒండ్లర్ పరువు నష్టం కేసు నమోదు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్పై ఆమె మాజీ భర్త ఒండ్లర్ కోమ్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. టెలివిజన్ వేదికగా తనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై తదుపరి విచారణ నవంబర్ పందొమ్మిదో తేదీకి వాయిదా పడినట్లు తెలిపారు. గతంలో మేరీ కోమ్ తనపై చేసిన ఆర్థిక మోసాల ఆరోపణలను ఒండ్లర్ తీవ్రంగా ఖండించారు.