సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను ప్రమాదం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

పిల్లల సాధారణ ఫోటోలను సైతం ఏఐ టెక్నాలజీతో అసభ్యకర చిత్రాలుగా మారుస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న కొత్త ముప్పుపై పిల్లల భద్రతా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయని నిపుణులు తెలిపారు. తల్లిదండ్రులు ప్రేమతో సోషల్ మీడియాలో పంచుకుంటున్న చిన్నారుల చిత్రాలను నేరస్థులు దుర్వినియోగం చేస్తూ డబ్బుల కోసం వేధిస్తున్నారని, దీనివల్ల చిన్నారులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని వారు హెచ్చరించారు.