రాజకీయ ప్రవేశంపై మాజీ మావోయిస్టుల మధ్య భిన్న మార్గాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మావోయిస్టుల అడుగులు కొత్త చర్చకు దారితీశాయని మాజీ నేతలు తెలిపారు. లంక పాపి రెడ్డి జన తెలంగాణ పార్టీని స్థాపించి ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజి రెడ్డి వంటి వారు ఆ పార్టీతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ విశాలమైన సామాజిక, రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని వారు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.