తుపాన్ ధాటికి కుప్పకూలిన అల్లూరి జిల్లా పాఠశాల భవనం

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ పరిధిలోని బొడ్డజువి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు తుపాన్ ప్రభావంతో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పాఠశాలలో ఉన్న విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ విద్య కోసం ఏర్పాటు చేసిన అరవై ఐదు అంగుళాల టీవీ కూడా పూర్తిగా ధ్వంసమైంది. భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతోనే ఈ దుస్థితి తలెత్తిందని, ప్రస్తుతం విద్యార్థులు తాత్కాలిక పాకల్లో చదువుకోవాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.