వరద నీటితో రిజర్వాయర్లు చెరువులను నింపాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, నీటి ప్రవాహాలపై అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల వస్తున్న వరద నీటిని ఏమాత్రం వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్రంలోని రిజర్వాయర్లు మరియు చెరువులను తక్షణమే నింపాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా నీటిని మళ్లించేందుకు మొబైల్ లిఫ్ట్‌లను వినియోగించాలని ఆయన సూచించారు. ప్రస్తుత వర్షాల వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా రీఛార్జ్ అవుతున్నాయని అధికారులకు వెల్లడించారు. ప్రతి ప్రాజెక్టులో నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.