కండక్టర్ ప్రవళిక మృతి కేసు: నిందితురాలపై హత్య కేసు నమోదు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతికి కారణమైన ప్రయాణికురాలపై హత్య కేసు నమోదు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి వద్ద ప్రవళిక పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన, మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక తల్లికి ఉద్యోగంతో పాటు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, కోటి రూపాయల ప్రమాద బీమా అందిస్తామని స్పష్టం చేశారు.