దిల్లీలో దారుణం బాలికపై సామూహిక అత్యాచారంచేసి హత్య

రిపోర్టర్: కృష్ణ స్థలం: దిల్లీ

దేశ రాజధాని దిల్లీలో 17 ఏళ్ల బాలికపై స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. ఉత్తర దిల్లీలోని స్వరూప్‌ నగర్ ప్రాంతంలో సెప్టెంబర్ 13న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.