కొటియాలో ఉద్రిక్తత: ఏపీ పోలీసు చెక్పోస్ట్ను స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు
రిపోర్టర్: సురేష్
స్థలం: Koraput
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కొటియా పంచాయతీలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, వివాదాస్పద ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసు చెక్పోస్ట్ను ఒడిశా పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ టీపీఎస్ మండల్ వెల్లడించారు. నవంబర్ 5న ఏపీ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనలు తెలపడంతో పాటు బారికేడ్లను కూల్చివేశారని, పరిస్థితిని అదుపు చేయడానికి భారీగా బలగాలను మోహరించామని అధికారులు స్పష్టం చేశారు.