అధికారుల తీరుపై మధుయాష్కీ గౌడ్ తీవ్ర ఆగ్రహం: ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని వ్యాఖ్య

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో అధికారుల తీరుపై ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొందరు అధికారులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ప్రస్తుతం మంత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పాలన బాగున్నప్పటికీ, పూర్తిగా అధికారులపై ఆధారపడటం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.