ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు తీపి కబురు: కొత్త రూట్లో పుష్పక్ ఏసీ బస్సులు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులు, విమానాశ్రయ ప్రయాణికుల సౌకర్యార్థం పటాన్చెరు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు సరికొత్త పుష్పక్ లగ్జరీ ఏసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పశ్చిమ హైదరాబాద్ ఐటీ కారిడార్‌ను అనుసంధానించే ఈ నూతన మార్గంలో బస్సులు నడపడం ద్వారా ప్రైవేట్ క్యాబ్ ఛార్జీల భారం తప్పుతుందని, తక్కువ ధరకే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.