జేఎన్యూలో సంచలనం: లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎంపీ అంగోమ్చా డిస్మిస్
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
విద్యార్థినుల లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు కావడంతో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్ను సర్వీసు నుంచి తక్షణమే డిస్మిస్ చేసినట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ డి పండిత్ శుక్రవారం తెలిపారు. పదకొండు మంది విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదులపై అంతర్గత కమిటీ విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.