న్యూస్క్లిక్ ఈసీఐఆర్ కొట్టివేతపై సుప్రీంకోర్టు నోటీసులు: ఈడీ అప్పీల్ పై స్పందన కోరిన ధర్మాసనం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

న్యూస్క్లిక్ వెబ్ పోర్టల్ పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ మేరకు పోర్టల్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి నాల్గు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినట్లు న్యాయస్థానం వర్గాలు వెల్లడించాయి. విదేశీ విరాళాల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ పరిణామం చోటుచేసుకుంది.