కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారి నిర్మాణానికి అటవీ అనుమతుల ఆటంకం

రిపోర్టర్: మహేష్ స్థలం: నంద్యాల

తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కేంద్రం చేపట్టిన కల్వకుర్తి-నంద్యాల 167కే జాతీయ రహదారి నిర్మాణానికి నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని నల్లమల అభయారణ్య ప్రాంతంలో అటవీ అనుమతులు ఆటంకంగా మారాయి. అటవీ అనుమతులు లభించకపోవడం, భారీ వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించాల్సి రానుండటంతో జాతీయ రహదారుల సంస్థ అధికారులు భానుముక్కల టర్నింగ్ నుంచి బానకచర్ల మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలపై సర్వే నిర్వహిస్తున్నారు.