నిజామాబాద్ మార్కెట్లో సన్న ధాన్యానికి రికార్డు స్థాయి ధర
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నిజామాబాద్
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ వరి కోతలు ప్రారంభం కావడంతో సన్న ధాన్యానికి బహిరంగ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా బోధన్, వర్ని ప్రాంతాల్లో బిపిటి సోనామసూరి సన్న ధాన్యం క్వింటాకు ఏకంగా రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు పలుకుతోంది. ప్రైవేట్ వ్యాపారులు పొలాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు తక్షణమే నగదు చెల్లిస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.