రాప్తాడు పర్యటనలో కుటుంబ రాజకీయాలపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి నారా లోకేశ్ పర్యటించి ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాను ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు తనయుడిగా రాలేదని, టీడీపీ కార్యకర్తల త్యాగాల వల్లే ఇక్కడ ఉన్నానని లోకేశ్ పేర్కొన్నారు. అయితే కుటుంబ నేపథ్యం లేకపోతే రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చేవాడా అంటూ నెటిజన్లు ఆయన వ్యాఖ్యలపై సెటైర్లు విసురుతున్నారు.