హైదరాబాద్ లో దారుణం: పాతబస్తీలో రౌడీషీటర్ సయ్యద్ ఒమర్ భీకర హత్య
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్ పాతబస్తీలోని కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సయ్యద్ ఒమర్ అలియాస్ మషల్లా ఒమర్ అనే యువకుడిని దుండగులు కత్తులతో దారుణంగా నరికి చంపినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. హఫీజ్ బాబా నగర్ లో తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఒమర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, అడ్డుబోయిన సయ్యద్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ హత్యకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.