మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి వినతిపత్రమిచ్చిన జర్నలిస్టులు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

జగిత్యాలలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు కాసం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కోశాధికారి కొండా సంజీవ కుమార్ తదితర ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.