రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్: మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ లో ప్రయాణికులపై దొంగల దాడి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సతారా

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సల్పా రైల్వే స్టేషన్ సమీపంలో దొంగల ముఠా ఘాతుకానికి పాల్పడింది. రైల్వే సిగ్నల్ను ట్యాంపరింగ్ చేసి ముంబై-కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. ఎస్ 2 కోచ్లోకి ప్రవేశించి ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి రెండు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు వెంబడించకుండా కోచ్లపై రాళ్లు రువ్వి భయాందోళనకు గురిచేశారని, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.