యాదాద్రి విద్యుత్ కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో జీ-9 బొగ్గు కొరత, అధికారుల వైఫల్యంపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు. నాటి రాజకీయ కారణాల వల్ల పిట్ హెడ్ కాకుండా దూరంగా నిర్మాణం చేపట్టడంతో రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరాలోపు పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు.