రాజాపేట విద్యార్థులకు బాలల హక్కులు మరియు రక్షణపై విస్తృత అవగాహన

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపియు ఔట్రీచ్ వర్కర్ కె. హరిబాబు, చైల్డ్ హెల్ప్లైన్ కేస్ వర్కర్ టి. మహిపాల్ హాజరై విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలు, రక్షణ పద్ధతులపై విలువైన సూచనలు చేశారు. బాల్యవివాహాలు, పోక్సో చట్టం, సామాజిక మాధ్యమాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి అత్యవసర నంబర్లను తెలిపారు.