ఈశాన్య రాష్ట్రాల్లో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు సాధ్యమైందన్న కిరణ్ రిజిజు
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో సెమీకండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు సాధ్యమైందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఢిల్లీలో ఎన్డీటీవీ పీపుల్స్ సంసద్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఊహించని అభివృద్ధి ఈ ప్రాంతంలో జరుగుతోందని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు ఓటమి భయంతోనే విమర్శలు చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.