పాలకొండ ఎన్నికల తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థుల హవా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ లో ఏడు వార్డుల ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఇందులో టీడీపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకోగా, వైఎస్సార్సీపీ రెండు, జనసేన ఒక వార్డు లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల కౌంటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.