యూట్యూబర్ రమా నందన్ శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి
రిపోర్టర్: అశోక్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు రమా నందనను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ నుంచి వస్తుండగా లుకౌట్ సర్కులర్ ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను ఆపారు. ఇంగ్లండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆమెకు నోటీసులు అందజేశారు.