గుంటూరులో గంజాయి దందా గుట్టురట్టు: తొమ్మిది మంది నిందితుల అరెస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Guntur
గుంటూరు జిల్లా మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్ లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందితుల నుంచి మూడు కిలోలకు పైగా గంజాయిని, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు విజయవాడకు చెందిన మహిళ వద్ద గంజాయి కొనుగోలు చేసి, చిన్న ప్యాకెట్లుగా మార్చి యువకులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన పేర్కొన్నారు.