రూపాయి తక్కువగా ఇచ్చి చిక్కుల్లో పడ్డ ఐఆర్సీటీసీ: వినియోగదారుడికి భారీ ఊరట
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Kasaragod
రైల్వే టికెట్ రద్దు చేస్తే రావాల్సిన మొత్తంలో రూపాయి తక్కువగా చెల్లించడంతో కేరళకు చెందిన ప్రయాణికుడు కాసరగోడ్ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఈ విషయాన్ని కమిషన్ చైర్మన్ క్రిషన్ కే స్పష్టం చేశారు. ఐఆర్సీటీసీ సేవల్లో లోపం ఉందని పేర్కొన్న కోర్టు, రూపాయి వాపసుతో పాటు వంద రూపాయల నష్టపరిహారం, మూడు వేల రూపాయల కోర్టు ఖర్చులు ముప్పై రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.