పండుగ వేళ ఊళ్లకు వెళ్లేవారు ఇళ్ల రక్షణపై అప్రమత్తంగా ఉండాలి
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
బతుకమ్మ మరియు దసరా పండుగలకు స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు ఇళ్లలో బంగారం, నగదును సురక్షితంగా భద్రపరచుకోవాలని నర్సంపేట సీఐ ముస్క శ్రీనివాస్ సూచించారు. ప్రయాణానికి ముందే స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే గస్తీని ముమ్మరం చేస్తామని ఆయన తెలిపారు. అనుమానితుల కదలికలపై వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.