ఘోర విమాన ప్రమాదం: ఫ్లోరిడాలో లీర్జెట్ కుప్పకూలి తొమ్మిది మంది దుర్మరణం

రిపోర్టర్: సునీల్ స్థలం: Florida

అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో లీర్జెట్ 60 విమానం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో సుమారు అర మైలు పరిధిలో మృతదేహాలు, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు గాల్లోనే విమానం ముక్కలైందా అనే కోణంలో లోతైన విచారణ చేపడుతున్నట్లు సమాచారం అందింది.