పేదలకు అండగా కాంగ్రెస్.. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ!

రిపోర్టర్: p.g. murthy స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పేదలకు అండగా నిలిచారు. ఆదివారం లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వై.కమలాకర్ రావ్, సయ్యద్ ఇసాక్, సయ్యద్ ఇబ్రహీం సహా పలువురు నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.