వైవిధ్యమైన కథతో వస్తున్న ధూమకేతు ట్రైలర్ విడుదల

రిపోర్టర్: హరి స్థలం: కేరళ

సజిన్ గోపు, నిఖిలా విమల్ జంటగా సుధీ మడ్డిసన్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ధూమకేతు ట్రైలర్ విడుదలైంది. టైమ్ లూప్, కామెడీ, మిస్టరీ, మర్డర్ త్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లయిన కొత్త దంపతుల జీవితంలో జరిగే ఊహించని పరిణామాలు, కాల చక్రంలో చిక్కుకున్న కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.