జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో విద్యార్థి సంఘాల భారీ నిరసన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ముగ్గురు మహిళా హాస్టల్ విద్యార్థినులకు జారీ చేసిన ఖాళీ నోటీసులను వ్యతిరేకిస్తూ పలు విద్యార్థి సంఘాలు గురువారం ఆందోళన చేపట్టాయి. బేసిక్ వసతులు, భోజనంపై ప్రశ్నించినందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఐసా ఆరోపించగా, ఇది కేవలం మెరిట్ నిబంధనల ఉల్లంఘన మాత్రమేనని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.