శ్రీకాకుళం కిడ్నీ వ్యాధులపై కొనసాగుతున్న ప్రత్యేక అధ్యయనం: కేంద్ర వైద్య విభాగం వెల్లడి
రిపోర్టర్: కిరణ్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో తీవ్రంగా వేధిస్తున్న దీర్ఘకాల కిడ్నీ సమస్యలకు మూల కారణాలను అన్వేషించేందుకు ప్రత్యేక అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర వైద్య పరిశోధన విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఈ పరిశోధన జరుగుతోందని తెలిపింది. ఈ అధ్యయనం ద్వారా సేకరించే విలువైన డేటాతో కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం సాధ్యమవుతుందని, సామాజికంగా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు రిస్క్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు స్పష్టం చేశారు.