వరంగల్: వంచనగిరిలో బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కొండా సురేఖ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: వరంగల్
బాధలో తోడుగా ఉంటూ, కష్టాల్లో అండగా నిలుస్తామని మాజీ మంత్రి కొండా సురేఖ భరోసా కల్పించారు. వరంగల్ జిల్లాలోని వంచనగిరిలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె స్వయంగా పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా బాధితులకు ఆర్థిక సాయం అందజేసి, కష్టకాలంలో ప్రభుత్వం మరియు తమ కుటుంబం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.