సామాన్యుడిలా మారిన ప్రభుత్వ విప్: హోటల్లో మిర్చి బజ్జీలు వేసిన ఐలయ్య
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి సమీపంలో బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు వెళ్తున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్గమధ్యలో ఒక హోటల్ వద్ద ఆగారు. అక్కడ స్థానికులతో ఆప్యాయంగా ముచ్చటించి స్వయంగా మిర్చి బజ్జీలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజాప్రతినిధిగా సామాన్యుడిలా ప్రజల మధ్య కలిసిపోయిన ఆయన సరళమైన వ్యవహారశైలిని స్థానికులు ఎంతగానో ప్రశంసించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.