మాజీ మంత్రి జోగి రమేష్ తీరుపై రెడ్డిగూడెం నేతల ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: మైలవరం
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల వైకాపా నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఆర్థిక సాయం కోరగా తన వద్ద లేవంటూ ఆయన బదులివ్వడంతో ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో వాదనలు చోటుచేసుకున్నాయి. డబ్బుల పంపకాలపై జరిగిన ఈ వివాదం స్థానిక రాజకీయ వర్గాల్ లో తీవ్ర కలకలం రేపింది.