విజయవాడలో నేషనల్ సరస్ మేళా: ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
రిపోర్టర్: సురేష్
స్థలం: Vijayawada
విజయవాడలో ఈనెల పదహైదు నుంచి ముప్పై ఒకటి వరకు తొలిసారిగా నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళాను విజయవంతం చేయాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ ప్రతిష్టాత్మక మేళాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్వయం సహాయక సంఘాలు ఇందులో పాల్గొంటాయని సీఎం తెలిపారు. ప్రభుత్వ శాఖల పౌర సేవలపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఉద్యోగుల సామర్థ్య పెంపుపై ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు.