జీకే వీధిలో ఓట్ల వేటలో కదంతొక్కిన కూటమి శ్రేణులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

జీకే వీధి మండలం కూటమి ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మాజీ జిల్లా టీడీపీ కార్యదర్శి ముక్కలి మహేష్, ఎస్టీ సెల్ స్టేట్ కార్యదర్శి కొర్ర బలరాం ఆధ్వర్యంలో రింతాడ, లక్కవరపుపేట, శంకడ, జీకే వీధి పంచాయతీలలో ప్రచారం సాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేనా, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.