ప్రయాణికుల రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

శ్రావణ మాసం, వినాయక చవితి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి నుంచి కాకినాడ, తిరుచానూరు మరియు వికారాబాద్ నుంచి గుంటూరు మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం సెప్టెంబర్ 11 నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.