ఊపిరితిత్తుల్ లో లంగ్ నోడ్యూల్స్ కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్టా: వైద్యుల స్పష్టత

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

ఊపిరితిత్తుల్ లో లంగ్ నోడ్యూల్స్ కనిపించినంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు కాదని ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కౌశిక్. ఎన్ తెలిపారు. ఛాతీ ఎక్స్-రే లేదా సీటీ స్కాన్ తీసినప్పుడు వెల్లడయ్యే ఈ చిన్న గడ్డలు చాలావరకు క్యాన్సర్ రహితమేనని ఆయన పేర్కొన్నారు. గత ఇన్ఫెక్షన్లు, వాపులు లేదా మచ్చల వల్ల ఇవి ఏర్పడతాయని, భయపడకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆయన సూచించారు.