మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల భారీ విజయం

రిపోర్టర్: గోపి స్థలం: తూర్పుగోదావరి

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం తొంబై ఆరు వార్డులకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైందని, కొవ్వూరు మరియు నిడదవోలు మున్సిపాలిటీల్ లో కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారని వారు స్పష్టం చేశారు.