ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఖమ్మం
ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమల్ల పాఠశాలలో విద్యార్థినులతో వ్యాయామ ఉపాధ్యాయుడు షఫిక్ అహ్మద్ అసభ్యంగా ప్రవర్తించాడని పదహారు మంది విద్యార్థినులు ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తీవ్ర ఆందోళన చేపట్టారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిందితుడు పీఈటీ సెలవు పెట్టడంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.