ఫార్ములా ఈ రేసు కేసు: ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఛార్జ్షీట్లో తనను ఏ1 నిందితుడిగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ, ఈ కేసు నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని కోరారు. ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య మాత్రమేనని పిటిషన్లో స్పష్టం చేశారు.