విమాన తయారీ కోసం భారీ త్రీడీ ప్రింటెడ్ స్టీల్ మోల్డ్ రూపకల్పన
రిపోర్టర్: గోపి
స్థలం: అమెరికా
అమెరికాలోని ఓక్ రిడ్జ్ నేషనల్ లాబొరేటరీ మరియు బోయింగ్ సంస్థలు సంయుక్తంగా నాసా హైకామ్ ప్రాజెక్ట్ కోసం భారీ త్రీడీ ప్రింటెడ్ స్టీల్ మోల్డ్ను అభివృద్ధి చేశాయి. దాదాపు రెండు టన్నుల బరువు, ఆరడుగుల ఎత్తు ఉన్న ఈ స్టాంప్ ఫామ్ డై మోల్డ్ను వైర్-ఆర్క్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ పద్ధతి ద్వారా రూపొందించారు. విమాన భాగాల తయారీ వేగం, సామర్థ్యాన్ని పెంచేందుకు రెండు రకాల ఉక్కును ఉపయోగించి ఈ వినూత్న సాంకేతికతను సృష్టించారు.