కృష్ణా జలాల పంపకాల్లో తేలని ప్రతిష్టంభన: ముగిసిన KRMB సమావేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. కృష్ణా జలాల్లో 50:50 వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేయగా, పాత పద్ధతిలోనే 66:34 నిష్పత్తి ఉండాలని ఏపీ పట్టుబట్టింది. నాగార్జునసాగర్‌లో తెలంగాణ చేపడుతున్న జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఏపీ అధికారులు కోరారు. ఇరు రాష్ట్రాల వాదనలతో కృష్ణా జలాల కేటాయింపులపై సందిగ్ధత కొనసాగుతోంది.